రాష్ట్రంలో కూటమి సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఇంత దారుణమైన పరిపాలనను తాను ఎన్నడూ చూడలేదన్నారు. 10 నెలలు అయినా ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రతి విద్యార్థికి సీఎం చంద్రబాబు రూ. 30 వేలు బాకీ ఉన్నారని అన్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జిల్లాల్లో వైసీపీ యువత పోరు కార్యక్రమం చేపట్టిందన్నారు.