శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్లకు ఐటీ షాక్
NEWS Mar 12,2025 10:55 am
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా విస్తరించిన శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని సంస్థల డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32, రోడ్ నం 10లో బొప్పన సుష్మ, సీమ ఇళ్లలో నిన్న సాయంత్రం నుండి ఇప్పటి దాకా దాడులు చేపట్టడం విస్తు పోయేలా చేసింది. టాక్స్ ఎగొట్టిన డబ్బును ఎక్కడికి తరలించారనే అంశంపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. దీనికి సంబంధించి ఎలాంటి సమాధానం చెప్పడం లేదని తెలిసింది.