ఎమ్మెల్యే కేసులో సైబర్ నేరగాళ్లు అరెస్ట్
NEWS Mar 12,2025 10:37 am
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వేముల వీరేశంను న్యూడ్ వీడియో కాల్స్ తో బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లను గుర్తించారు పోలీసులు. వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గర్తించినట్లు తెలిపారు. వారం రోజుల కిందట వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేశారు. ఆ తర్వాత వాట్సాప్ నెంబర్‌కు స్క్రీన్ రికార్డు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో నిందితులను నకిరేకల్‌కు తీసుకొచ్చారు. వారిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ కు తరలించారు.