రేవతి అరెస్ట్ అప్రజాస్వామికం
NEWS Mar 12,2025 10:19 am
సీనియర్ జర్నలిస్ట్ , పల్స్ యూట్యూబ్ ఛానల్ సీఈవో రేవతితో పాటు తన భర్త చైతన్య దంతలూరిని పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు కేటీఆర్. ఎక్స్ వేదికగా ఆయన బుధవారం స్పందించారు.