పోసాని కృష్ణ మురళికి బిగ్ రిలీఫ్
NEWS Mar 11,2025 06:22 pm
నటుడు పోసాని కృష్ణ మురళికి బిగ్ రిలీఫ్ లభించింది. మంగళవారం ఆదోని, విజయవాడ కోర్టుల్లో బెయిల్ మంజూరు అయింది. ఇప్పటికే రాజంపేట, నరసరావుపేట కోర్టుల్లో పోసానికి బెయిల్ మంజూరు కాగా మిగతా కేసుల్లో BNS చట్టం 353 సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో నాలుగు కేసుల్లో పోసానికి రిమాండ్ లభించింది. ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్నారు పోసాని కృష్ణ మురళి. ఇదిలా ఉండగా అన్ని కేసుల్లో రిలీఫ్ రావటంతో మార్చి 12న బుధవారం విడుదల అయ్యే అవకాశం ఉంది.