దశల వారీగా మన బడి..మన భవిష్యత్తు
NEWS Mar 11,2025 02:59 pm
రాష్ట్రంలో మనబడి మన భవిష్యత్తు పథకంలో ఫేజ్1,2,3 కింద చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాటిని దశల వారీగా పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పనుల పురోగతిపై వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి, కోళ్ల లలితకుమారి, గౌతు శిరీష, పల్లె సింధూర రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం చేపట్టిన ఫేజ్-1,2 లోనే అనేక పనులు పెండింగ్ లో పెట్టారని తెలిఆపరు. ఫేజ్-1,2 పనులు పూర్తి చేయడానికి రూ. 4,789 కోట్లు అవసరం అన్నారు.