కొల్లు రవీంద్రపై బొత్స ఫైర్
NEWS Mar 11,2025 01:29 pm
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. మంత్రి కొల్లు రవీంద్ర చేసిన ఆరోపణలపై భగ్గుమన్నారు. శాసన మండలిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైల్స్ తగుల బెట్టినట్లు రుజువు చూపించాలని డిమాండ్ చేశారు. తప్పులు జరిగినట్లు భావిస్తే విచారణ చేపట్టాలన్నారు. మంత్రి చేసిన కామెంట్స్ అన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు. ఆయన చేసిన ఆరోపణలను రికార్డ్స్ నుంచి తొలగించాలని అన్నారు బొత్స సత్యనారాయణ.