కేసీఆర్ ఓ చెల్లని రూపాయి
NEWS Mar 11,2025 10:43 am
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై భగ్గుమన్నారు. ఆయన ఓ చెల్లని రూపాయి అంటూ మండిపడ్డారు. ఆయన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒనగూరింది ఏమీ లేదన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో రాజకీయం చేశాడని, అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. కేటీఆర్ ఓ పిచ్చోడంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. చిట్ చాట్ సందర్బంగా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ తన బాధ్యతను విస్మరించడం దారుణమన్నారు రేవంత్ రెడ్డి.