క్షీణించిన భారతీయ రూపాయి విలువ
NEWS Mar 11,2025 09:11 am
రోజు రోజుకు భారతీయ రూపాయి క్షీణిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, టారిఫ్ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండటంతో పాటు విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకు పోతుండటంతో దేశీయ కరెన్సీ విలువ 36 పైసలు పడి పోయింది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ వారం కనిష్ఠ స్థాయి 87.31కి జారుకుంది. డాలర్‌తో పోల్చితే 87.31 వద్దకు చేరుకుంది.