ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా తనపై నమ్మకం ఉంచిన ఏఐసీసీ హై కమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో తన జీవితం మొత్తం తెలంగాణకే అంకితం చేశానని అన్నారు. తనకు ఛాన్స్ రావడంతో చాలా మంది వాళ్ల ఇంట్లో బిడ్డకు వచ్చినట్లు ఆనంద పడుతున్నారని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి పార్టీ ఇచ్చిన అదనపు బాధ్యత ఇది అని, దానిని సమర్థవంతంగా నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు.