పోసాని కృష్ణ మురళికి బిగ్ రిలీఫ్
NEWS Mar 11,2025 08:15 am
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళికి బిగ్ రిలీఫ్ దక్కింది. తనకు బెయిల్ మంజూరు చేసింది నరసరావుపేట కోర్టు మెజిస్ట్రేట్. పోసాని తరఫున వాదనలు వినిపించిన వైసీపీ లీగల్ టీమ్ న్యాయవాది రాప్రోలు శ్రీనివాసరావు. వాదనలు విన్న అనంతరం కీలక తీర్పు వెలువరించారు. దాంతో పాటు రూ.10 వేలు పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , నారా లోకేష్, భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 17 కేసులు నమోదయ్యాయి.