పాసు పుస్తకాలతో పాత లే ఔట్ల కబ్జా
NEWS Mar 10,2025 09:09 pm
తండ్రులు అమ్మారు..తనయులు వచ్చి పాసు పుస్తకాలు తమ పేరిట సృష్టించుకుని పాత లే ఔట్లను చెరిపేసి పంట పొలాలుగా సాగు చేసేస్తున్నారని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులందాయి. సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయి. ఇందులో పాతలేఔట్ల ఆక్రమణలే ఎక్కువగా ఉన్నాయి. రహదారులు, పార్కులు కూడా ఉన్నాయని.. వీటిని కాపాడాలని పలువురు కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కోరారు. లే ఔట్లలో రహదారులను కబ్జాచేయడం, పార్కులు కలిపేయడం వంటివి జరుగుతున్నాయని వాపోయారు.