రైతులను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ డెయిరీలు
NEWS Mar 10,2025 08:19 pm
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిప్పులు చెరిగారు. కూటమి సర్కార్ పాలన గాడి తప్పిందన్నారు. పాడి రైతులను ప్రైవేట్ డెయిరీలు బహిరంగంగానే దోపిడీ చేస్తున్నా పట్టించు కోవడం లేదన్నారు. ధరలు లేక నష్ట పోతున్నారని వాపోయారు. తమ పాలనలో పాడి రైతులకు భరోసా కల్పించామన్నారు. ఆనాడు పాల ధరలను సర్కారే నిర్ణయించిందన్నారు. మహిళా డెయిరీ సంఘాలను ప్రోత్సహించిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు. జాతీయ స్థాయిలో పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఏపీని నిలిపామన్నారు. దీని కారణంగా రూ. 5100 కోట్ల లాభం చేకూరిందన్నారు.