ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థుల నామినేషన్
NEWS Mar 10,2025 07:26 pm
ఏపీ శాసన సభ సభ్యుల కోటాలో ప్రకటించిన ఐదు శాసన మండలి సభ్యుల (MLC) ఎన్నికకు కూటమికి చెందిన నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాల్టితో దరఖాస్తు గడువు ముగిసింది. టీడిపీ, జనసేన, బీజెపి కూటమి లోని జనసేన పార్టీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు గత శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా, టీడిపీ కి చెందిన ముగ్గురు అభ్యర్థులు, బీజెపీ కి చెందిన ఒక అభ్యర్థి దాఖలు చేశారు. మొత్తం ఐదు స్థానాలకు ఐదురుగు కూటమి అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది.