వెంకన్నకు హోం మంత్రి పట్టు వస్త్రాలు
NEWS Mar 10,2025 07:13 pm
నక్కపల్లి ఉపమాకలో వేంచేసిన వేంకటేశ్వర స్వామికి మంత్రి వంగలపూడి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి వార్షిక కల్యాణోత్సవం సందర్భంగా స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో మంత్రికి నాయకులు, దేవస్థాన అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, అంతరాలయంలో మంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాల్ని పండితులు అందజేశారు. అనంతరం భరత నాట్య కళాకారుల్ని మంత్రి అనిత ఘనంగా సత్కరించారు.