విజయ సాయి రెడ్డిపై కేసు నమోదు
NEWS Mar 10,2025 07:02 pm
వైసీపీ సీనియర్ నేతలకు బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం కూటమి సర్కార్ కేసుల నమోదుకు శ్రీకారం చుట్టింది. నరసారావుపేటలో వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కుమారుడు శివరామకృష్ణపై తప్పుడు కేసులు పెట్టించారంటూ టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. ఆనాడు జగన్ సర్కార్ కావాలని తప్పుడు కేసులు నమోదు చేయడంతో తట్టుకోలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. మరో వైపు 2019లో లంచం ఇచ్చినట్లు తప్పుడు కేసు పెట్టిన మాజీ క్రికెటర్ నాగరాజుపై కూడా కేసు నమోదైంది.