వివేకా హత్య కేసులో సాక్షి రీ పోస్ట్ మార్టం
NEWS Mar 10,2025 05:28 pm
మాజీ ఎంపీ దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు కడప ఎస్పీ జి. అశోక్ కుమార్. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం పులివెందుల లయోల పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రంగన్న మృత దేమానికి రీ పోస్ట్ మార్టం నిర్వహించారు. తిరుపతి ఎఫ్ ఎస్ ఎల్ టీం, కడప వైద్య బృందంతో పాటు ఫోరెన్సిక్ టీం పాల్గొన్నాయి. అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, జమ్మలమడుగు డిఎస్పీ, పులివెందుల తహసీల్దార్ విఆర్వోల సమక్షంలో రంగన్న మృతదేహం వెలికితీశారు