ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు నామినేషన్
NEWS Mar 10,2025 05:06 pm
బీఆర్ఎస్ పార్టీ తరపున దాసోజు శ్రవణ్ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసన మండలిలో ప్రజల గొంతుకగా ఉండే గొప్ప బాధ్యతను తనకు అప్పగించినందుకు పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకుడు హరీశ్ రావు సమక్షంలో దాసోజు శ్రవణ్ కుమార్ దరఖాస్తు దాఖలు చేశారు. సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు కూడా తనతో పాటు వచ్చారు.