గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
NEWS Mar 10,2025 03:57 pm
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షల ప్రొవిజనల్ మార్కులను ప్రకటించింది. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు లాగిన్ వివరాలతో మార్కులు చూసుకోవచ్చని స్పష్టం చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. గతేడాది అక్టోబర్ చివరివారంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగ్గా.. 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు.