తెలంగాణకు రూ. 18,800 కోట్ల ఆదాయం
NEWS Mar 10,2025 03:50 pm
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతి నెలా రూ. 18,800 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారమే తాను ఈ వివరాలు వెల్లడించానని తెలిపారు. కానీ పదే పదే రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు రూ. 6,500 కోట్లు ఖర్చులకు పోగా నికరంగా రూ. 12 వేల కోట్ల ఆదాయం రాష్ట్రం వద్ద ఉంటుందన్నారు. పొద్దన లేస్తే అబద్దాలు చెప్పడం తప్పా సీఎం ఇప్పటి వరకు ఏం చేశారంటూ ప్రశ్నించారు కవిత.