టీడీపీ ఎంపీ సంచలన ప్రకటన
NEWS Mar 10,2025 03:46 pm
టీడీపీ విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సంచలన ప్రకటన చేశారు. జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టాలని అన్నారు. అంతే కాదు తన నియోజకవర్గ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ముగ్గురు పిల్లలున్న కుటుంబంలో మూడో సంతానం అమ్మాయి అయితే రూ.50,000 గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు. అబ్బాయి అయితే దూడ, ఆవు కానుకగా ఇస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రోజు రోజుకు జనాభా తగ్గి పోతోందని, పిల్లలను ఎక్కువ మందిని కనాలంటూ పిలుపునిచ్చారు పార్టీ చీఫ్, సీఎం చంద్రబాబు నాయుడు.