ప్రణయ్ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. తొమ్మిది నెలల పాటు కష్టపడి ఛార్జ్ షీట్ దాఖలు చేశామని అన్నారు. ఏ ఆధారాన్ని వదలలేదని అన్నారు. సెప్టెంబర్ 14, 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కు గురయ్యాడు. ఆ సమయంలో జిల్లా ఎస్పీగా ఉన్నారు ప్రస్తుత కమిషనర్ గా ఉన్న ఏవీ రంగనాథ్. కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తనకు గౌరవం ఉందన్నారు. ఇలాంటి తీర్పులు నేరాలకు పాల్పడే వారిలో భయం కలిగించేలా చేస్తాయన్నారు. లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించడంలో తాము ముందుంటామన్నారు.