రెండేళ్లలో మామునూరు ఎయిర్ పోర్ట్ పూర్తి
NEWS Mar 10,2025 03:21 pm
కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య కీలక ప్రకటన చేశారు. మామునూరు ఎయిర్ పోర్టుకు సంబంధించి భూ సేకరణ పూర్తయిందన్నారు. విమానాశ్రయం రెండు సంవత్సరాలలో పూర్తవుతుందని, ఇక్కడి నుంచి నేరుగా ఇతర ప్రాంతాలకు, దేశాలకు విమానాల రాక పోకలు సాగుతాయని తెలిపారు. తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నం వల్లనే ఎయిర్ పోర్టు మంజూరైందని అన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పట్టుపట్టి ఎయిర్ పోర్టు తీసుకు వచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలలో నిజం లేదన్నారు. తామే తీసుకు వచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు కడియం కావ్య.