తెలంగాణలో గాడి తప్పిన పాలన
NEWS Mar 10,2025 03:03 pm
మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పడంలో, మోసం చేయడంలో నెంబర్ వన్ అన్నారు. ఆయన మాటలను ఎవరూ వినిపించు కోవడం లేదన్నారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు చేతెలెత్తేసిందన్నారు. ఏ ఒక్క సామాజిక వర్గం సంతోషంగా లేదన్నారు. జాబ్స్ భర్తీ చేస్తామన్నారని కానీ ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు హరీశ్ రావు. మహిళలను నిట్ట నిలువునా మోసం చేసింది చాలక ఇప్పుడు కోటీశ్వరులను చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.