వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ వాయిదా
NEWS Mar 10,2025 02:59 pm
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని బెయిల్ పిటిషన్ ను వాయిదా వేసింది కోర్టు. వంశీని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన దావాను కూడా వాయిదా వేసింది. వంశీ బ్యారెక్ ను భద్రత రీత్యా మార్చలేమంటూ స్పష్టం చేశారు జైలు సూపరింటెండెంట్. అనారోగ్యం కారణంగా తనకు వేరే బ్యారెక్ కేటాయించాలని, తనను కావాలని కూటమి సర్కార్ వేధింపులకు గురి చేస్తోందంటూ ఆరోపించారు వంశీ.