నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు
NEWS Mar 10,2025 02:53 pm
5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన నలుగురు అభ్యర్థులు తాజాగా నామినేషన్లు వేశారు. టీడీపీ అభ్యర్థులు బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు.