ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాదే
NEWS Mar 09,2025 09:53 pm
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో భారత జట్టు ప్రత్యర్థి న్యూజిలాండ్ ను ఓడించింది. విశ్వ విజేతగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కీవీస్ నిర్ణీత 50 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బరిలోకి దిగిన భారత జట్టు అద్బుతంగా ఆడింది. ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. తనకు ఎదురే లేదని చాటింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చివరి వరకు ఉన్నారు .