విశ్వ శిల్పి రామప్ప పుస్తకం ఆవిష్కరణ
NEWS Mar 09,2025 05:58 pm
సమాచార, పౌర సంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు కన్నెకంటి వెంకట రమణ రాసిన వ్యాసాల సంపుటి 'కాకతీయుల గురించి మరికొంత...' అనే పుస్తకాన్ని రాష్ట్ర శాసన మండలి లో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి ఆవిష్కరించారు. విశ్వ బ్రాహ్మణ ధర్మ పీఠం స్వర్ణోత్సవాలు నాంపల్లి లోని తెలుగు విశ్వ విద్యాలయంలోని ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కాకతీయుల గురించి మరికొంత అనే పుస్తకం తోపాటు, విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం సంచాలకులు చొల్లేటి కృష్ణమాచార్యులు రచించిన 'విశ్వ శిల్పి రామప్ప రమణీయ శిల్పకళ' అనే చారిత్రిక నవలల ను కూడా ఆవిష్కరించారు.