ఎయిమ్స్ లో చేరిన ఉప రాష్ట్రపతి
NEWS Mar 09,2025 05:29 pm
భారత దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ఆస్పత్రి పాలయ్యారు. అర్ధరాత్రి ఉన్నట్టుండి ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో హుటా హుటిన ఎయిమ్స్ కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. జగదీప్ ధన్ ఖర్ వయసు 73 ఏళ్లు. వైద్యుల ప్రకారం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం పరిశీలన కొనసాగుతోందన్నారు. ఎయిమ్స్‌లో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధన్‌ఖర్‌ను క్రిటికల్ కేర్ యూనిట్ (సిసియు)లో చేర్చారు.