మెట్ పల్లి మండలం పెద్దాపూర్ నుంచి కోరుట్లకు వెళ్లే రోడ్డులో పెను ప్రమాదం పొంచి ఉంది. వాగుపై నిర్మించిన బ్రిడ్జ్ చివరి భాగం విరిగి ప్రమాదకారంగా మారింది. బ్రిడ్జికి పక్కనే ఉన్న స్తంభానికి కట్టెలతో కట్టారు ,ఒక్క పక్క కాకతీయ కెనాల్ మరో పక్కన వాగు ఉన్న, ఈ బ్రిడ్జ్ పైనుండి రాత్రి గ్రామానికి వెళ్లాలంటే పైన వాహనాలు ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడపాలి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్ర మత్తు వదిలి. ఈ రోడ్డును పరిశీలించి, తగు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.