మిలియన్ మార్చ్ స్ఫూర్తిని కొనసాగించాలి
NEWS Mar 09,2025 04:33 pm
తెలంగాణ రాష్ట్ర సాధనలో మిలియన్ మార్చ్ కార్యక్రమానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నదని అన్నారు సీపీఐ ఎంఎల్ డెమోక్రసీ సీనియర్ నేత కె. గోవర్దన్ . ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కు గా భావించిన మలిదశ ఉద్యమం విజయ తీరాలకు చేరడంలో మిలియన్ మార్చ్ ది ప్రధాన పోరాట ఘట్టమని పేర్కొన్నారు. అది సీమాంద్ర దోపిడీ దారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించడం తో పాటు, ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచిందన్నారు. ఆ స్పూర్తిని కొనసాగించాలని కోరారు.