పెద్దాపూర్ మల్లన్న స్వామి జాతరకు ముస్తాబు
NEWS Mar 09,2025 05:40 pm
తెలంగాణ రాష్ట్రంలోనే బోనాల జాతరలో పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్న స్వామి ఆలయం ఉత్సవాలకు ముస్తాబవుతోంది. హోలీ పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం గ్రామస్థులు బోనాల జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో సుమారు 50,000 పైగా భక్తులు బోనాలు తీసి మొక్కులు చెల్లించుకుంటారు. ఒకేసారి 50,000 మంది భక్తులు గుడి చుట్టూ బోనాలు తీయడం ఇక్కడి ఆనవాయితీ. దీనిని చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు.