ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ మహిళా విభాగం ప్రెసిడెంట్ రోహిణి ఖడ్సే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి శిక్ష లేకుండా మహిళలకు చంపేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో మర్డర్ చేసుకునే మహత్ భాగ్యాన్ని కల్పించాలని కోరారు. స్త్రీలందరి తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నామని, కనీసం ఒకే ఒక్కరినైనా చంపేందుకు ఛాన్స్ ఇవ్వాలన్నారు. మహిళలపై రోజు రోజుకు నేరాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో పై వెసులుబాటు కల్పించాలని లేఖ రాయడం విశేషం.