సిరియా అంతర్యుద్దంతో అతలాకుతలం అవుతోంది. గత రెండు రోజులుగా మాజీ చీఫ్ బషర్ అల్ అసద్ మద్దతుదారులు..ప్రభుత్వ దళాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా 1000 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. అత్యంత ఘోరమైన దుర్గటనగా పేర్కొంటున్నాయి వార్తా సంస్థలు. గత ఏడాది తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించుకున్నారు. దీంతో దేశ అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారి పోయాడు. అక్కడ తలదాచుకున్నాడు. డమాస్కస్ లో కొత్త సర్కార్ కొలువు తీరింది. దీనిని తట్టుకోలేక అసద్ మద్దతుదారులు జబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని మట్టు పెట్టాయి.