మార్కాపురంను జిల్లా చేస్తా - సీఎం
NEWS Mar 09,2025 10:13 am
సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. మార్కాపురంను జిల్లా చేస్తామని అన్నారు. అంతే కాకుండా వెలుగొండ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఆస్తులు పోయినా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండాను 43 ఏళ్లుగా భుజాన వేసుకుని మోస్తున్నారని కొనియాడారు. కార్యకర్తలు, నేతల కృషి వల్లనే ఇవాళ అధికారంలోకి వచ్చామన్నారు. నేతలు పార్టీ మారినా కార్యకర్తలు పార్టీ కోసం అలాగే ఉన్నారని, వారి నిబద్దత, నిజాయితీని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు సీఎం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని, లెక్కలేనన్ని కేసులు నమోదు చేసినా చెక్కు చెదరలేదన్నారు.