తిరుమల భక్తులతో కిటకిట
NEWS Mar 09,2025 10:05 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్తుల రద్దీతో కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 74 వేల 646 మంది దర్శించుకున్నారు. 30 వేల 769 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.52 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 28 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని , ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 12 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.