తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవం
NEWS Mar 09,2025 09:22 am
తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈనెల 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ తెప్పోత్సవాలు ప్రాచీన కాలం నుంచి జరగడం ఆనవాయితీగా వస్తోంది. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో 'తిరుపల్లి ఓడై తిరునాళ్', తెలుగులో 'తెప్ప తిరునాళ్లు' అని కూడా అంటారు. ఉత్సవాలను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.