ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగనుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ స్టేడియంలో టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. ఇరు జట్లు బలంగా ఉండడంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. భారత జట్టు న్యూజిలాండ్ తో పోటీ పడనుంది. ఆతిథ్య పాకిస్తాన్ జట్టు తీవ్ర నిరాశకు గురి చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ ఒక్క మ్యాచ్ గెలవకుండానే నిష్క్రమించింది. రోహిత్ సేన ఎలాగైనా సరే ట్రోఫీని గెలుచు కోవాలని పట్టుదలతో ఉంది. దేశ వ్యాప్తంగా ఫైనల్ మ్యాచ్ కోసం వేచి చూస్తోంది.