అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
NEWS Mar 09,2025 11:34 am
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం సతీమణి జయతార మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనలోని వెలుగు మరింత పెంచాలని, నిత్యం కొత్త ఆశయాలకు ఆవిర్భావ స్థలంగా నిలవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మనం కేవలం కలలు కనేవాళ్లు కాదు, వాటిని నిజం చేసుకునేవాళ్లం, మహిళగా పుట్టడం గౌరవం, కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత. మనకు మనం సంఘీభావంగా ఉండాలని అన్నారు.