ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద కూలీల ఆటో బోల్తా పడింది . ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది కూలీలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఒకరికి కడుపులో పేగులు బయట పడ్డాయి, 13 మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వార ఏటూరునాగారం సామాజికాసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ములుగు ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. వీరంతా రామన్మగూడెంలో మిర్చి కూలీ పనులు ముగించుకుని కమలాపురం వెళుతుండగా ప్రమాదం జరిగింది.