దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ డీఆర్ఐ అధికారులకు అడ్డంగా దొరికి పోయి ఊచలు లెక్క పెడుతున్న నటి రాన్యా రావుకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కీలక ప్రకటన చేసింది. ఈమేరకు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు గాను తనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా తను ఏకంగా 14.8 కేజీల బంగారు కడ్డీలను తీసుకు వచ్చింది. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో కూడా ఒప్పుకుంది. ప్రస్తుతం రిమాండ్ లో ఉంది ఈ ముద్దుగుమ్మ.