పెద్దాపూర్ గ్రామంలో మహిళా దినోత్సవ వేడుకలు
NEWS Mar 09,2025 05:44 pm
పెద్దాపూర్ గ్రామంలో మహిళా దినోత్సవ సందర్భంగా గ్రామంలో ఉన్న మహిళలందరికీ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన వారిని ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కరాటే లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, డాక్టర్ సంపత్ రెడ్డి, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. 300 మందికి పైగా మహిళలు హాజరయ్యారు.