మహిళా లోకం ప్రపంచానికి ఆధారం
NEWS Mar 08,2025 01:13 pm
మహిళలు లేక పోతే ఈ ప్రపంచమే ఉండదన్నారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీ లేకపోతే జననం లేదు. గమనం లేదు. అసలు సృష్టే లేదన్నారు. తల్లిగా, సోదరిగా, భార్యగా, కూతురుగా జీవితంలోని ప్రతి దశలోనూ మగవాడిని నడిపించేది మహిళేనని పేర్కొన్నారు. స్త్రీ ఎక్కడ గౌరవం పొందుతుందో ఆ ఇల్లు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఇవ్వాళ దేశంలో, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు వైఎస్ షర్మిల.