అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు లేక పోతే ప్రపంచం లేదన్నారు. ఇవాళ అన్ని రంగాలలో మహిళలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. రాష్ట్రాభివృద్దిలో సైతం ముఖ్య భూమిక పోషిస్తున్నారని అన్నారు. చదువుపై , స్వశక్తితో పైకి వచ్చేందుకు కృషి చేస్తే ఏదో ఒక రోజు విజయం తప్పక వరిస్తుందని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ.