మహిళా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వంగలపూడి అనిత. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఇబ్బందులు ఉండేవని కానీ ఇప్పుడు అన్ని రంగాలలో మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. నేల నుంచి నింగి దాకా శ్రామికుల నుంచి రోదసీలో వ్యోమగాముల దాకా మహిళలు చేయని పని అంటూ ఏదీ లేదన్నారు. ఇవాళ క్రీడా రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు. ఇటు రాష్ట్రానికి అటు దేశానికి పేరు తీసుకు వస్తున్నారని తెలిపారు. మహిళా సంఘాల పనితీరు గొప్పగా ఉందన్నారు.