కోరుట్ల పట్టణంలో గత నాలుగు రోజుల నుండి మంచినీళ్లు అందక పట్టణవాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు 22వ వార్డు మాజీ కౌన్సిలర్ మాడవేని నరేష్. మిషన్ భగీరథ నీళ్లు రంగు మారడంతో పశువులు కూడా ముట్టడం లేదన్నారు. సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించు కోవడం లేదని ఆరోపించారు. వెంటనే వాగు నుండి మంచినీటిని సరఫరా చేయాలని కోరారు.