రెస్టారెంట్ బిర్యానీలో పురుగు
NEWS Mar 09,2025 05:49 pm
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోని ఇష్ట రెస్టారెంట్ లో బిర్యానీ తిందామని వెళ్లిన దంపతులకు షాక్ తగిలింది. పురుగులతో కూడిన బిర్యానీ పెట్టడంతో అవాక్కయ్యారు. తిన్న బిర్యానికి ఏకంగా రూ. 1200 బిల్లు వేశారని వాపోయారు. ఫుడ్ ఇన్స్ పెక్టర్ నిర్వాకం కారణంగానే ఇలా జరుగుతోందని అంటున్నారు. పట్టణంలోని హొటళ్లు, టిఫిన్ సెంటర్లలో అపరిశుభ్రతతో కూడిన టిఫిన్లు వడ్డిస్తున్నా పట్టించు కోవడం లేదని మండిపడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లపై తూతూ మంత్రంగా ఫైన్ వేస్తున్నారని, చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.