ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే విధంగా భారీ ఖర్చుతో తయారైంది తెలంగాణ స్టేట్ గెస్ట్ హౌస్. వేరే రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వడం దీనిని వినియోగంలోకి తీసుకు వచ్చామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బేగంపేటలోని ప్రజాభవన్ ఆవరణలో ఈ స్టేట్ గెస్ట్ హౌస్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు .