దాము సేవలు చిరస్మరణీయం
NEWS Mar 07,2025 05:56 pm
మాజీ ఎమ్మెల్యే తుమ్మల వెంకటరమణ (దాము) చేసిన సేవలు మరువలేనివని బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. శుక్రవారం ఆయన జయంతి పురస్కరించుకొని వారి స్వగృహంలో దాము ఫోటోకు పూలమాలవేసి జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు మాట్లాడుతూ. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతి గ్రామంలో మంచినీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యము కల్పించారాని అన్నారు.