జూనియర్ అడ్వకేట్ల కోసం ప్రమాద బీమా
– జక్కుల వంశీకృష్ణ
NEWS Mar 07,2025 11:29 am
తెలంగాణ జూనియర్ అడ్వకేట్ల అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీ కృష్ణ జూనియర్ న్యాయవాదుల కోసం ప్రమాద బీమా పాలసీ ప్రవేశపెట్టారు. ఈ పాలసీని వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్లలో ప్రారంభించారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు జయకర్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవన్, హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు అభినందించారు. న్యాయవాదులు అనిల్ కుమార్, శివ, సత్యం తదితరులు పాల్గొన్నారు.